శ్రీ ఉజ్జయినీ మహాకాళీ ఆశీర్వాదం తో రాంగోపాల్ పేట్ డివిజన్ లో ఎన్నడు జరగని అభివృద్ధిని చేసి చూపించా…… రాంగోపాల్ పేట్ డివిజన్ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్.

బేగంపేట ఫిబ్రవరి 11
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆశీర్వాదం తో రాంగోపాల్ పేట్ డివిజన్ లో గతంలో ఎన్నడు జరగని అభివృద్ధిని చేసి చూపించానని, రాంగోపాల్ పేట్ డివిజన్ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్.అన్నారు.ప్రజలు,అదికారులు,పార్టీనాయకులు.కార్యకర్తల సహకారంలో గత ఐదు సంవత్సరాలుగా డివిజన్ లో ఎంతో ప్రగతి సాధించామన్నారు.బుదవారం పాన్ బజార్ లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో గత ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.సంజీవయ్య పార్క్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేశామని….అది కాకుండా స్థానిక ఎంపీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు రూ ఒక కోటితో పలు అభివృద్ధి కార్యమాలుచేశామన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి సుమారు రూ 40 కోట్ల మేర పలు అభివృద్ధి పనులు చేశామన్నారు.అందులో భాగంగా డ్రైనేజీ,మంచినీటి లైన్లు,నాళాల పూడికతీత పనులు పూర్తి
చేశామన్నారు.15 కోట్ల రూపాయలతో 36 చోట్ల నూతన రోడ్డును నిర్మించామన్నారు.నూతనంగా 225 విద్యుత్ స్తంభాలను నాటించామన్నారు.డివిజన్ ను అభివృద్ధి చేసేందుకు అధికారులు సహకారం అందించారనిచెప్పారు.ముఖ్యంగా తాను కార్పొరేటర్ గా ఉన్నప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోధీ,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ లు మా డివిజన్ పరిధిలోని ఉన్న శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సొంత ఖర్చుతో సేవా పలు కార్యక్రమాలు
తన సొంత ఖర్చుతో డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలు చేశానని…కరోనా కాలంలో 15 రోజుల పాటు అన్నదానం చేశామని…ఆపదలో ఉన్న వారికి తమకు తోచిన సహాయంఅందించామన్నారు.ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ. పాఠశాల, కళాశాల విద్యార్థులకు బుక్స్, బ్యాగ్ లను పంపిణీ చేయడమే కాకుండా మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడాఅందజేశామన్నారు.గత ఎలక్షన్లో ప్రజలు ఎలాగైతే తమనుఆదరించారో..రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ మారను…తమ పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా బరిలో ఉంటా
నాకు కన్నతల్లి లాంటి పార్టీ బిజెపి అని…పార్టీలోనే ఉంటానని ఆమె అన్నారు.కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు మరోసారి పార్టీ అవకాశమిస్తుందని ధీమా ఉందని…ఒక వేళ ఇవ్వకపోతే బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు ఎస్ఆర్ మల్లేష్,చీరశ్రీకాంత్,మదన్,అశ్విని,నిర్మల,ప్రవీణ్,గోపీ కిషన్,నరేంద్ర పాల్, శ్రీను తదితరనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *