పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని వామ పక్ష సంఘాలు హెచ్చరించాయి. తాళ్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీ, అశ, పంచాయితీ యూనియన్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మానవ హారం ఏర్పాటు చేసారు. ఆమెరికా వాణిజ్య ఓప్పదాల వలన వ్యవసాయ రంగానికి హాని చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఐటియు నాయకురాలు కల్పన హెచ్చరించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తేస్తే ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఊరుకోబోమని ట్రెడ్ యూనియన్, రైతు సంఘ, కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు. ఆయా సంఘాలు నాయకులు రామా రావు, రమణ పాల్గొన్నారు.
