ఆంధ్ర ప్రదేశ్ ఫుట్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఈనెల 8న నిర్వహించిన పోటీలలో తాళ్లూరు శ్రీ సరస్వతి విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామమూర్తి తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థులను గురువారం పాఠశాలలో సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి అభినందించారు. అండర్ – 16 అంతర్ జిల్లాల పోటీలలో 9వ తరగతికి చెందిన మందా రాకేష్, తన్నీరు సాయి కిరణ్ కుమార్ లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయినట్లు చెప్పారు. వీరు కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనున్నట్లు చెప్పారు. ఫుట్ బాల్ బృందాన్ని చైర్మన్ ఎవీ రమణా రెడ్డి అభినందించారు. హెచ్ఎం వావిలాల శ్రీరామ మూర్తి, పీఈఓ జిజ్జం వికాన్ లు పాల్గొన్నారు.
