బేగంపేట ఫిబ్రవరి 14
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రం లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించడం పై బేగంపేట లో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ నేతృత్వంలో కాంగ్రెస్ యువనాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు,కార్య కర్తలు బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో టపాకాయలు కాల్చి ,స్వీట్లు పంపిణీ చేశారు.ఒకరి కొకరు మిఠాయిలు తినిపిచుకున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ అడపా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకోవడం సి ఎం పనితీరుకు నిదర్శనమని అన్నారు.ప్రతి పక్ష పార్టీ లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వ పనితీరుకు ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సలీం ఖాన్,సి.రాజేందర్ ముదిరాజ్, మునీర్ ఖాన్,హనీఫ్ ఖాన్,పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

