శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం…..ముఖ్యఅతిథిగా పాల్గొన్న జంపన.

కంటోన్మెంట్ ఫిబ్రవరి 17, (జె ఎస్ డి ఎం న్యూస్) :
న్యూ బోయినపల్లి బాపూజీనగర్ శ్రీదేవి నల్ల పోచమ్మ ఆలయం, జయనగర్ చౌరస్తా లోని నల్లపోచమ్మ ఆలయాల వద్ద ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. అనంతరం జంపన ప్రతాప్ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని ,
అన్నదానం మహా దానం అని అన్నారు. బాపూజీనగర్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు. అజిత్ కళ్యాణ్, పుట్టి నర్సింహా,శ్రీకాంత్, రామరావు,విశ్వనాధ్, జయనగర్ చౌరస్తా నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్. సత్యనారాయణ. నాగేష్. శశిధర్ గౌడ్.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *