శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అన్నదానం….పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్…..

కంటోన్మెంట్ ఫిబ్రవరి 17 , (జే ఎస్ డి ఎం న్యూస్) : కంటోన్మెంట్ ఆరో వార్డు
న్యూ బోయిన్ పల్లి చిన్న తోకట్ట లో ని కట్ట మైసమ్మ ఆలయంలో మంగళవారం అమావాస్య సందర్భంగా కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తో ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం పాండు యాదవ్ కు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువా తో సత్కరించారు.ఆయన మాట్లాడుతూ. అమావాస్య రోజున అన్నదానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నదానం అన్ని దానాలలో కెల్లా మిన్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో జాజుల క్రాంతి,సాయి, విఠల్ , అరుణ్ యాదవ్,బచ్చన్ రాజు యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *