విఆర్ ఓ లు కేవలం రెవిన్యూ విధులకే పరిమితం చేయ్యాలి – తాళ్లూరు మండల విఆర్డీఓల సంఘం

గ్రామ రెవిన్యూ కి ఒక విఆర్ ఓ ఉండటం వలన గ్రామ రెవిన్యూ కార్యాలయం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా సేవలు అందించటానికి వీలు ఉంటుందని తాళ్లూరు మండల రెవిన్యూ సంఘం బాధ్యులు అన్నారు. తాళ్లూరు రాష్ట్ర రెవిన్యూ సంఘం ఆదేశాల మేరకు తాళ్లూరు విఆర్ఓలు సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ లు
ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్ కు తమ డిమాండ్ల పత్రాన్ని అందించారు. క్లస్టర్ విధానం వలన విఆర్ ఓ ల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. రెండు గ్రామ రెవిన్యూ విలేజ్ ల కు ఒక విఆర్ఓ ను ఇవ్వటం వలన తీవ్ర పనిభారం పెరుగుతుందని అన్నారు. క్యాడర్ సంఖ్య తగ్గిపోవటం వలన భవిష్యత్ లో ప్రమోషన్లను తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. అర్హలైన విఆస్ఏ లకు ప్రమోషన్ కల్పించి క్యాడర్ సంఖ్య తగ్గకుండా చూడాలని కోరారు. విఆర్ ఓ ల అందరికి డి డి ఓలుగా తహసీల్దార్ ఉండేలా నిర్ణయం తీఉకోవాలని ,రెవిన్యూ లైన్ డిపార్ట్ మెంట్ ద్వారా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నచివాలయంలో రెవిన్యూ శాఖకు సంబంధం లేని పనులు, సర్వేలు చెయ్యాలని పంచాయితీ సెక్రటరీలు, ఎంపీడీఓ లు, కమీషనర్ విఆర్ ఓ ల ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మరోవైపు జీ ఎస్ డబ్ల్యు అధికారులు రెవిన్యూ పనులే కాదు ఇతర పనులు కూడ చెయ్యాలని ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. బయో మెట్రిక్ గ్రామ సచివాలయంలో వెయ్యాలని జీతాలు నిలుపుదల చేస్తామని చెప్పటం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే చీఫ్ సెక్రటరీ ఎపీ ఎఫ్ ఆర్ ఎన్ యాప్లో ఫేస్ అటెండెన్స్ వెయ్యాలని ఆదేశాలు ఇచ్చారని, జీ ఎస్ డబ్యు అధికారులు మాత్రం బయో మెట్రిక్ వెయ్యాలని చెప్పటం విరుద్దంగా ఉన్నాయని దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. విఆర్ ఓ లు తప్పు చేస్తే నేరుగా చర్యలు తీసుకోవాలని, ఐవీ ఆర్ ఎస్ సర్వే చేసి ఎదో ఒకటి
తెలియక నొక్కిన వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని విఆర్ ఓ ల కు షోకాజ్ నోటీసులు జారీ చేయటం, మోమోలు ఇచ్చి సస్పేండ్ చేస్తామని చెప్పటం తో అనేక మంది విఆర్ ఓ లు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. గ్రామ రెవిన్యూ కార్యాలయం ఏర్పాటు చేసి కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చినట్లయితే ఈ – ఫైల్ తో
ఫైల్స్ పంపుతామని, అప్పుడు ఎక్కడ లేట్ అయిన విషయం తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి ఉన్నతాధికారులు తమ సమస్యలను తెలియజెయ్యాలని విఆర్ ఓ లు పి చంద్రశేఖర్ రావు, రమణా రెడ్డి, శివా రెడ్డి, కె నాగ లక్ష్మి, వై సుశీలా రాణి, చిన్న క్రిష్ణయ్య, నాగూర్ బీ, బి రమణ తదితరులు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *