తాళ్లూరు మండలంలో జాతీయ నులు పురుగుల దినోత్సవం సందర్భంగా ఆన్ బెండా జోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజేష్‌లు, హెచ్ ఎన్ వై విజయమ్మ, పి వీ రవిలు, ఆరోగ్య, ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో పాఠశాలలకు వెళ్లి 4900 మందికి ఆన్ బెండా జోల్ మాత్రలు అందించి ఆరోగ్య పరమైన సూచనలు చేసారు.



తూర్పుగంగవరం ప్రాధమిక కేంద్రం పరధిలో పీ హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,హెచ్ ఈ ఓచంద్రశేఖర్, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ వీ నుశీల, ఆరోగ్య, ఆశ, ఆంగన్ వాడీ కార్యకర్తలు, ఉ పాధ్యాయులు ఆధ్వర్యంలో 5227 మందికి ఆల్ బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసారు. ఎంఈఓ జి సుబ్బయ్య, సుధాకర రావు ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు పాటించి విద్యార్థులచే మాత్రలు మ్రింగించారు.
