కొంపల్లి ఫిబ్రవరి 18
(జె ఎస్ డి ఎం న్యూస్) :
చాయ్ ప్రేమికుల కోసం నగరం లోని కొంపల్లిలో సోమా టీ హౌస్ ను ప్రారంభించారు.ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా విభిన్నమైన రుచుల చాయ్ ను ఇక్కడ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు చాయ్ తో పాటు రక రకాల బిస్కట్ లను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు.సోమా టీ హౌస్ ను బుధవారం మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు ,కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ల చేతుల మీదుగా టీ హౌస్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఇలా వ్యాపార రంగం వైపు దృష్టి సారించడం అభినందనీయం అన్నారు.విభిన్న మైన చాయ్ ను అందుబాటులోకి తీసుకు రావడం సంతోషమన్నారు.జంపన మాట్లాడుతూ యువకులు తమ కాళ్ళపై నిలబడేలా వ్యాపార రంగం వైపు దృష్టి సారించదాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దండుగుల యాదగిరి, వి ఆర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ సోమా టీ హౌస్ నిర్వాహకులు అఖిల్ రెడ్డి, ప్రీతం ,నాగరాజు పాల్గొన్నారు.


