బేగంపేట ఫిబ్రవరి 18
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని , క్రీడల్లో గాయాలపాలైన వారి కేరియర్ ఇక ఆగిపోతుంది ఆనుకోకుండా వారికి సరైన వైద్యసేవలు అందించి ముందడుగు వేసేలా సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం కృషిచేస్తోందని డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి తెలిపారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో కేరియర్ ప్రమాదంలోకి నెట్టిన సమయంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో అందించిన వైద్య సేవలతో తీవ్రమైన మోకాలి గాయాలను ఆదిగమించిన కబడ్డీ స్టార్ రామావత్ నందిని జాతీయ వేదికపై తిరిగి పునరాగమనం చేసిన సందర్భంగా బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో నందిని నీ ఘనంగా సన్మానించారు.
2022లో నందిని కుడి మోకాలిలో ఏసీఎల్ లిగమెంట్ గాయం కావడంతో పోటీ క్రీడలకు దూరమయ్యారు. ప్రత్యేక వైద్యం కోసం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్ర శేఖర్ ను సంప్రదించారు. ఏసీఎల్ రీకన్ స్ట్రక్షన్ శస్త్రచికిత్స ఆనంతరం కొన్ని నెలల్లోనే మళ్లీ మైదానంలోకి వచ్చి పోటీలను ప్రారంభించారు. 2024లో ఆదే మోకాలికి మళ్లీ గాయం అయింది. ఈ సారి మెనిస్కస్ దెబ్బతింది. డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో డాక్టర్ల బృందం సమయోచిత శస్త్రచికిత్స, రీహ్యాబిలిటేషన్ అందించడం ద్వారా గాయం పూర్తిగా నయమై మూడు నెలల్లోనే తిరిగి క్రీడల్లో ఆడుగు పెట్టారు. ఆసాధారణమైన ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగిన నందిని ఇప్పుడు తెలంగాణ తరపున 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబ్బడ్డీ చాంపియన్షిప్ లో పాల్గొనడానికి ఎంపికయిందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఆమె ఆచెంచల ఆత్మవిశ్వాసం, పోరాట స్పూర్తికి గౌరవంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి నేతృత్వంలో నందిని సత్కరించారు. డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు గాయాల నివారణ, ఆధునిక స్పోర్స్ మెడిసిన్ రీహ్యాబిలిటేషన్ పై ఆవగాహన కల్పించడంతో పాటు సరైన నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తే కేరీర్ కు ముగింపు కాదనే విషయంతెలుసుకోవాలన్నారుహైదరాబాద్ ఫార్మా హబ్, టెక్నాలజీ హబ్ ల తో పాటు స్పోర్ట్స్ ఆర్థోస్కోపీ మెడిసిన్ హబ్ గా కూడా చేయవచ్చన్నారు.
ఈ సందర్భంగా (మాజీ భారత కబ్బడ్డీ క్రీడాకారుడు), డీఎస్పీ వేణుగోపాల్, తెలంగాణ బాస్కెట్బాల్ ఆసోసియేషన్ జనరల్ సెక్రటరి పృధ్వీశ్వర్ రెడ్డి, సిఎస్ఎస్ హెచ్ క్లినికల్ హెడ్ డాక్టర్ సుమన్ తడగొండ, హైదరాబాద్ క్రికెట్ అకాడమి, రంజీ టీం సీనియర్ ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ రాజేష్, సెంటర్ ఫర్ స్పైన్ ఆండ్ స్పోర్ట్స్ హెల్త్ ఫౌండర్ సీఈఓ, పుల్లెల గోపీచంద్ ఆకాడమి నరేష్ కుమార్ తదితరులు పాల్గొని వారి ఆనుభవాలను పంచుకున్నారు. భారతదేశంలో 80 శాతం మంది క్రీడాకారులు స్పోర్ట్స్ గాయాల కారణంగా క్రీడలకు దూరమవుతున్నారని, అలాంటి వారికి తిరిగి ఆధునిక వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తున్న కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ ఆదర్శ్ ఆన్నపరెడ్డి తదితరుల నేతృత్వంలో నందిని ఘనంగా సన్మానించారు.



