సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా…..ప్రజలకుహృదయపూర్వక నమస్కారాలు…..సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లి ఖార్జున్.

కంటోన్మెంట్ ఫిబ్రవరి 18 (జేఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని.ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు.అని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లి ఖార్జున్ అన్నారు.తనకు రెండవ సారి నామినేటెడ్ సభ్యురాలిగా నియామకం కల్పించిన కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ అధికారులు, మల్కాజ్ గిరి ఎం పి ఈటెల రాజేందర్ లకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేశారు. ముఖ్యంగా తన మీద విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను అని భానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు.గత సంవత్సరం కాలంలో
ఎం పి ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 8 వార్డులలో సుమారు రూ. 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రోడ్లు, కాల్వలు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి పనులను అందరి సహకారంతో పూర్తి చేశానన్నారు.మీ విశ్వాసానికి ప్రతిఫలంగా రెండవసారి కూడా నామినేటెడ్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు.రానున్న రోజుల్లో సుమారు రూ. 313 కోట్లతో వివిధ వార్డుల్లో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో ప్రణాళికలుసిద్ధమవుతున్నాయన్నారు. ఇది కంటోన్మెంట్ అభివృద్ధిలో ఒక కీలకమైన మైలురాయి అవుతుందనీ భానుక పేర్కొన్నారు.అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ ద్వారా కంటోన్మెంట్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు రూ. 50 కోట్లు కేటాయించే విధంగా ఎంపీ ఈటెల కృషి కొనసాగుతోందన్నారు. ఇందుకు ఆయనకు
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
రాబోయే వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో సమన్వయం చేసి ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని దశలవారీగా పూర్తి చేస్తూ, అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా సేవ చేయడం తన లక్ష్యం అని ఆమె తెలియ జేశారు. రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కట్టుబడి ఉన్నానన్నారు.ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తనపై ఉండాలని బానుక నర్మద మల్లిఖార్జున్ కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *