సచివాలయ ఉద్యోగులు తమకు ఇచ్చిన నర్వేలను నకాలంలో పూర్తి చెయ్యాలని
ఎంపీడీఓ పి అజిత కోరారు. విఠలాపురం సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ సర్వేను ఆమె పరిశీలించారు. నమోదు ప్రజలు నహకరించాలని కోరారు. అక్షర ఆంధ్ర, ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్షించారు. అనంతరం విఠలాపురం, తాళ్లూరు వెంకట రెడ్డి పాలెం ప్అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించారు. గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ వివరాలను పరిశీలించారు. పిల్లల వివరాలను పరిశీలించి వారికి అందిస్తున్న పోషక ఆహారం పరిశీలించారు. చిన్నారులు వయస్సుకు తగిన బరువు ఉన్నారా లేదా అన్న విషయాలను రికార్డులలో పరిశీలించారు. అందిస్తున్న గ్రుడ్లు, ఆహార ప్యాకెట్స్ పై గడువు తేదీలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పద్మజ, తదితరులు పాల్గొన్నారు.


