హైదరాబాద్ ఫిబ్రవరి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, ఇటీవల కాలంలో వాహనదారుల సౌకర్యార్థం ఉంచిన ‘ఫ్రీ-లెఫ్ట్’ (Free-Left) మార్గాలను అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయంఏర్పడుతున్నట్లు గుర్తించి, దీనిపై కఠిన చర్యలు చేపట్టింది.ట్రాఫిక్ అంతరాయం జంక్షన్ల వద్ద ఫ్రీ-లెఫ్ట్ మార్గాలను బ్లాక్ చేయడం వల్ల వాహనాల పోకలకు ఆటంకం కలగడమే కాకుండా, అనవసరమైన ట్రాఫిక్ జామ్ మరియు ప్రమాదాలకు దారితీస్తోంది. ఇది నిబంధనలు పాటించే ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది.
ఫ్రీ-లెఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిఘా పెంచిన క్రమంలో, కేవలం 09-02-2026 నుండి 20-02-2026 వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 9,142 కేసులు నమోదు చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం (ఎం వి యాక్ట్) ప్రకారం జరిమానాలు విధిస్తున్నారు.
చట్టపరమైన చర్యలతో పాటు, సోషల్ మీడియా వేదికల ద్వారా వాహనదారులలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నాము. జంక్షన్ల వద్ద ఫ్రీ-లెఫ్ట్ మార్గాలను అడ్డుకోవద్దని, అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలను పెంచుతుందని వాహనదారులను హెచ్చరిస్తున్నాము. ట్రాఫిక్ ఉల్లంఘనలను గమనించిన పౌరులు మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల (Facebook, X) ద్వారా లేదా ఈ నంబర్లకు ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626
ఈ-చలాన్ హెల్ప్‌డెస్క్ 8712661690 లకు తెలియ జేయవచ్చనారు.
ఫ్రీ-లెఫ్ట్ నిబంధనలుఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక డ్రైవ్ 12 రోజుల్లో 9,142 కేసులు నమోదు.
21
Feb