బేగంపేట ఫిబ్రవరి 21
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన సంచలన గృహచోరీ కేసును బేగంపేట పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 235 బంగారు బంగారుఆభరణాలు రెండు సెల్ ఫోన్లు,రూ 65వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనపై శనివారం బేగంపేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సమావేశంలో ఏ సి పి గోపాల కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న బేగంపేట్‌లోని శ్యాంలాల్ బిల్డింగ్స్‌లో ఉన్న సత్యకృష్ణ సిరిసంపద అపార్ట్‌మెంట్స్ నివాసి ఎం. అనురాధ (60) ఫిర్యాదు చేశారు. 15న కుటుంబ కార్యక్రమం నిమిత్తం ఇంటికి తాళం వేసి కవాడిగూడ కు వెళ్లిందన్నారు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పని చేసేందుకు వచ్చిన పని మనిషి ఇంటి తాళాలు పగుల గొట్టి వున్న సమాచారాన్ని యజమానురాలు అనురాధకు తెలియజేసింది.ఆమె వచ్చి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి లోపల ఉన్న అల్మిరా ధ్వంసం చేసి బంగారు చెవిపోగులు, ఉంగరాలు, గొలుసులు, వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బిసాయి ప్రదీప్ (25), ఎడ్ల ప్రవీణ్ కుమార్ (32)గా గుర్తించారు. వారి వద్ద నుంచి 235 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.40 లక్షలు.వుంటుందన్నారు.
విచారణలో నిందితులు చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో కూడా చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ కేసును బేగంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఛేదించారు. మల్కాజిగిరి డిసిపి శ్రీధర్, బేగంపేట ఏసీపీ పి. గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎస్‌హెచ్‌ఓ సైదులు, సిబ్బంది, సీసీఎస్ కంటోన్మెంట్ బృందం సహకారంతో నిందితులను పట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఏ సి పి గోపాలకృష్ణ మాట్లాడుతూ
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన నగదు, ఆభరణాలను ఇంట్లో ఉంచవద్దని, బలమైన తాళాలు వినియోగించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.



