ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తి గత గ్రామ పరిశుభ్రతే ముఖ్యమని వక్తలు
అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అజిత, టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, ఎఎంసీ డైరెక్టర్ నాగేంద్ర హనుమా రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని స్వచ్ఛ రధాలను ప్రారంభించారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం ఒక ప్రత్యేక మైన థీమ్ తో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి రోజు పరిసరాలు పరిశు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంఈఓ జి నుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎపీఎం దేవరాజ్, ఎఈ హనుమంత రావు, ఎన్ ఏ మల్లిఖార్జున, జే ఏ క్రిష్ణ చందు, టీపి పాల్ రాయల్, గ్రామ కార్యదర్శులు నాగమల్లేశ్వరి, షహనాజ్ బేగం, సుబ్బా రెడ్డి, మొలకయ్య, శ్రీ వల్లి, ఈ విశేషమ్మ, తదితరులు పాల్గొని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసారు.

