పదవ తరగతి విద్యార్థులు తాము వ్రాసిన పరీక్షా ఫలితాలలో దొర్లిన తప్పులను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవతరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పరిశీలకులు, వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మూల్యాంకన పత్రాలను శనివారం అందించారు. జీవశాస్త్ర పబ్లిక్ పరీక్షల నన్నద్ధానికి పలు సూచనలు చేసారు. మధ్యాహ్నబోజనాన్ని పరిశీలించారు. హెచ్ఎం మిల్టన్, సైన్స్ ఉపాధ్యాయుడు సురేష్ కుమార్ లు పాల్గొన్నారు.

