రబీ 2025-26 పంటల నమోదు ప్రక్రియ. ఈ కె వైసీ, సూపర్ చెక్ మూడు రోజుల్లో నూరుశాతం పూర్తి చెయ్యాలని దర్శి సహాయ వ్యవసాయ సంచాలకులు కె బాలాజీ నాయక్ కోరారు.
మండలంలోని నాగంబొట్ల పాలెం, సోమవరప్పాడు, విఠలాపురం, తాళ్లూరు రైతు సేవా కేంద్రం పరధిలోని పంటల నమోదు ప్రక్రియ నూపర్ చెక్ రికార్డులను పరిశీలించారు. రికార్డులు తప్పులు దొర్లకుండా పూర్తి చెయ్యాలని సూచించారు. ఎవో ప్రసాద రావు, విఏఏ ప్రియ, సుప్రియ, అశోక్లు పాల్గొన్నారు.
