వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయి. 119 మంది విద్యార్థులకు గాను 103 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 16 మంది గైర్హాజరు అయినట్లు చీఫ్ వేణుగోపాల్, డీఓ మురళీలు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఎస్సై మల్లిఖార్జున రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్రలు సందర్శించారు.

