దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికైనా వైయస్సార్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షడు దారా అంజయ్య డిమాండ్ చేశారు. సోమవారం తాళ్లూరులో మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో దారా అంజయ్య మాట్లాడుతూ దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు అభినందనీయం అన్నారు. జగన్ దళిత అంతకులకు గొడుగు పట్టిన వైనాన్ని వెల్లడి చేసిందన్నారు. 22వ సంవత్సరం మే 19వ తేదీ వీధి సుబ్రహ్మణ్యం అను దళిత డ్రైవర్ను హత్య చేసి వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు, డోర్ డెలివరీ చేశారన్నారు. హంతకుడు ఎమ్మెల్సీ అనంత బాబుకు కాపు కాసి పోలీసులు అరెస్టు చేయకుండా కాపాడరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆందోళన చేస్తుంటే లెక్కచేయకుండా సిగ్గు లేకుండా జగన్ దళిత అంతకుడు ఎమ్మెల్సీ అనంతబాబును వెంట పెట్టుకొని బహిరంగంగా తిరిగాడన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ కనుసన్న లో ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టు చేయకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా అప్పటి పోలీస్ అధికారులు సహకరించారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును మొక్కుబడిగా ముగించారన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ వైఖరిని తప్పు పట్టిందన్నారు. ఈ హత్య కేసులో అప్పటి డి.ఎస్.పి, సిఐ,ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిందన్నారు. రాజకీయాలకు లోబడి ప్రభుత్వ అధికారులు పనిచేయకూడదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్ట పరిధిలో మాత్రమే తీసుకోవాలన్నారు.అలాగే ఈ కేసులో వీధి సుబ్రహ్మణ్యం భార్య కూడా ఉందని సీట్ నిర్ధారించిందని వెంటనే ఆమెను కూడా అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు . ఇప్పటికైనా దళిత అంతకుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మాల మహానాడు జిల్లాఅధ్యక్షడు దారా అంజయ్య డిమాండ్ చేశారు.
