బేగంపేట ఫిబ్రవరి 24 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేట లోని పాటిగడ్డ లో బి ఆర్ ఎస్ నాయకులు నాని ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లీం లు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరీ, సోదరులు నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నిర్వాహకులు నాని, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేందర్, ఆరీఫ్, శేఖర్, మోయిన్, హాబీబ్, మహిళా నాయకురాలు నసీమా పా తదితరులు పాల్గొన్నారు.



