బేగంపేట ఫిబ్రవరి 24
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలంతా వినియోగించుకోవాలని మహంకాళి సిఐ రవికుమార్ పిలుపునిచ్చారు. ప్రింటింగ్ మిషన్ ఆవిష్కర్త జోహానన్స్ గూటెన్ బర్గ్ జయంతి (ప్రింటర్స్ డే )వేడుకలను మంగళవారం కళాసిగూడలో ఘనంగా నిర్వహించారు. మక్తలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహంకాళి సిఐ రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జొహన్నా స్ గూటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. పిఆర్ఓ శ్రీలత ఆధ్వర్యంలో యశోద, డిడిహెచ్ ,లెనోవా డాక్టర్ అగర్వాల్ డెంటల్ నుండి వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు నిర్వహించారు .ఈ సందర్భంగా మక్తలా ఫౌండేషన్ నిర్వాహకులు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రింటింగ్ మిషన్ ఆవిష్కర్త జోహాన్నస్ గూటెన్బర్గ్ జయంతి సందర్భంగా మక్తలా ఫౌండేషన్ తరపున హెల్త్ క్యాంపునిర్వహిస్తున్నామన్నారు. మహిళలకు మ్యామో గ్రఫీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ క్యాంపులో పెద్ద సంఖ్యలో సమీప బస్తీలు కాలనీ ల నుంచి వచ్చిన ప్రజల పరీక్షలు నిర్వహించుకున్నారు. క్యాంపులో పాల్గొన్న వారందరికీ తులసి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మక్తల్ శేఖర్ గౌడ్ సభ్యులు జెవి సూర్య, ప్రకాష్ ,హరికుమార్, శివకుమార్ ,డి ప్రకాష్, పూర్ణచందర్ ,ఆంజనేయులు, నరసింహ చారి ,వేణుగోపాల్ శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

