బేగంపేట ఫిబ్రవరి 24,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పాటిగడ్డ ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃసమీక్షించాలనీ. సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ మంగళవారం జీ హెచ్ ఎం సి కమీషనర్ ఆర్ వి.కర్ణన్ ను కల్సి విజ్ఞప్తి చేశారు. బేగంపేట రసూల్పుర జంక్షన్ నుంచి పాటిగడ్డ మీదుగా నెక్లెస్ రోడ్డుకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్ కారణంగా ఓల్డ్ పాటిగడ్డ మార్గంలో వారసత్వ కట్టడాలు మసీదులు కొన్ని ఇండ్లు దెబ్బతినే అవకాశం ఉందని, వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని లిఖిత పూర్వకంగా కోరారు. ప్రతిపాదిత ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃపరిశీలించి ప్రజలకు నష్టం కలగకుండా మార్పులు చేయాలని కోరారు. స్థానికులు,కాంగ్రెస్ నాయకు లతో కలిసి ఆమె కమిషనర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెక్లెస్ రోడ్ నుంచి పాటిగడ్డ వరకు ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కాలనీలో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేపడితే ఇండ్లు, పలు వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనిపేర్కొన్నారు.
స్థానికులు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్‌ను కమిషనర్‌కు సమర్పించినట్లు తెలిపారు. పేదల ఇళ్లు, వారసత్వ కట్టడాలను పరిరక్షించే విధంగా మార్గాన్ని పునఃసమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్, యువ నాయకులు అభిషేక్ అడపా, ఒబైద్ , సుల్తాన్ , ఇబ్రాహీం పటేల్, రఫీక్, హనీఫ్ ఖాన్, బాబ్లు, కాలనీ సభ్యులు, పాటిగడ్డ స్థానికులు, బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



