మారెళ్లలో భక్తి శ్రర్థలతో రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహణ

ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో శ్రీ బిహారీ లాల్ ఆరోరా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శిలా విగ్రహ మహా ప్రతిష్ట కార్యక్రమం రెండవ రోజు మంగళ వారం భక్తి శ్రర్థలతో నిర్వహించారు. బిహారీలాల్అరోరా కుటుంబసభ్యులు నాంచారమ్మ, రాజ్కుమార్ భన్సారీ దాస్ ఆరోరా, విమల్ రాజ్ కుమార్ ఆరోరా, మనీష్ రాజ్ కుమార్ అరోరా లు వారి కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలా విగ్రహ ప్రతిష్టాపకులు అనుమకొండ మచ్చెరికూరి శివ రామ బ్రహ్మర్షి చే ప్రతిష్టా ద్వితీయాహ్నికము పూజలు నిర్వహించారు. కార్యక్రమ రుత్వికులు ప్రధానా చార్యులు రాముగడు గురు బ్రహ్మయోగేశ్వరులు, వీర బ్రహ్మా చార్యులు, నోస్సం సుఖేచార్యులు, నాగ బ్రహ్మా చార్యులు, విశ్వ బ్రహ్మా చార్యుల ఆధ్వర్యంలో పలు ప్రత్యేక ప్రతిష్టా కార్యక్రమాలు రెండవ రోజు నిత్య పూజలు, మండలావాహనములు, శ్రీమన్నారాయణ సర్వ దేవతా వైఖానస సాంప్రదాయ పూజలు . జలాధి హోమం, తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం వేళ గ్రామోత్సవం, కూర్మాండ బలిహరణలు ధాన్యధి వాసము, పంచ శయ్యాది వాసములు, మూర్తి హోమం, పూజా హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *