మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ 2026 పేపర్ 2 పరీక్ష ఫలితాలలో శ్రీ ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శ్రీ ప్రతిభ విద్యాసంస్థలకు చెందిన ఏరువ వెంకట అమర్నాథ్ రెడ్డి ( 98.5) పర్సంటైల్, కుమ్మర వెంకట కళ్యాణ్ రామ్ (97.72) పర్సంటైల్ సాధించినట్లు శ్రీ ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను శ్రీ ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈవో నల్లూరి జయప్రకాష్ నారాయణ్ అభినందించారు.
