బేగంపేట ఫిబ్రవరి 25 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్యవైశ్యుల కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజలలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. రాంగోపాల్ పేట డివిజన్ ఆవుల మంద
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంపునర్నిర్మాణం చేసి ఆలయ ప్రారంభోత్సవం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సోమా ఆనంద్ కుమార్, అధ్యక్షుడు చందా బాలెందర్, కోశాధికారి తమ్మి వెంకటేష్, శరత్ కుమార్, వి. శ్రీనివాస్, టి. వేణుగోపాల్, జి. సూర్య ప్రకాష్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, నాయకులు కిషోర్, బచ్చు మహేష్, పబ్బా ప్రకాష్, ఆంజనేయులు, సతీష్, చంద్ర ప్రకాష్, ఆనంద్ పాటిల్, కొండాపురం మహేష్ యాదవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.




