వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు నగలు దొంగిలించిన పనిమనిషి అరెస్ట్.. 95.4 గ్రాముల బంగారం స్వాధీనం

హైదరాబాద్, (జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వృద్ధ దంపతులకు కేర్‌ టేకర్‌గా ఉంటూ, వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడిన మహిళను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి సుమారు రూ. 3,88,000/- విలువైన 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*ఫిర్యాదు దారుడి వివరాలు:* హబ్సిగూడ, గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.ఎల్.కె.ఎమ్. రావు (79). వయసు పైబడిన కారణం చేత వీరు తమను చూసుకోవడానికి ఒక సహాయకురాలిని నియమించుకున్నారు.

*నిందితురాలి వివరాలు:* అల్లం తేజస్వి (43), భర్త సుదర్శన్, నివాసం: మాల్రెడ్డి నగర్, ఆల్మాస్ గూడ, బడంగ్ పేట (సొంత గ్రామం: నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, కొండనాగుల).

*కేసు నేపథ్యం మరియు నిందితురాలి నేర చరిత్ర:* నిందితురాలు గతంలో కిరాణా షాపు నిర్వహించి నష్టపోవడంతో భారీగా అప్పులపాలైంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. జూన్ 2025లో సునీత అనే మహిళ ద్వారా హబ్సిగూడలోని డాక్టర్ రావు ఇంట్లో నెలకు రూ. 18,000/- జీతానికి కేర్‌టేకర్‌గా చేరింది. దంపతుల నమ్మకాన్ని సంపాదించిన ఆమె, అక్టోబర్ 2025 నుండి ఫిబ్రవరి 23, 2026 మధ్య కాలంలో ఇల్లు మరియు బెడ్‌రూమ్ శుభ్రం చేసే నెపంతో అలమరలో ఉన్న బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు మరియు చంద్రహారాన్ని విడతల వారీగా దొంగిలించింది.
ఫిబ్రవరి 25న ఉదయం 07:30 గంటల సమయంలో హబ్సిగూడ బస్ స్టాప్ వద్ద నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

• స్వాధీనం చేసుకున్న సొత్తు: 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ. 3,80,000/-) మరియు రూ. 8,000/- నగదు. (మొత్తం రికవరీ చేయడం జరిగింది).
సికింద్రాబాద్ జోన్ డీసీపీ  రక్షిత కె మూర్తి, , ఓయూ డివిజన్ ఏసీపీ  జి. జగన్  మార్గదర్శకత్వంలో, ఓయూ ఇన్‌స్పెక్టర్  ఎం. మహేష్ పర్యవేక్షణలో ఎస్.ఐ పి. కరుణాకర్ మరియు క్రైమ్ టీం (హెచ్.సి సత్యనారాయణ, విజయ్ కుమార్, వెంకటేష్, మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక, చెరుపల్లి ప్రియాంక) ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *