తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు-కె.శ్రీనివాస్ రెడ్డిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

జేఎస్ డి.ఎం న్యూస్ :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీని వాస్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలు వడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక 2024 ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికి గాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి నియమి తులైన విషయం తెలిసిందే. జర్నలిజం
రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాస్డ్డి, జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషిని ప్రభుత్వం గుర్తించి ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయన మరో రెండేళ్ల పాటు (2028 ఫిబ్రవరి 25 వరకు) తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగనున్నారు. జర్నలిస్టులకు అక్రెడిటే షన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *