మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన కార్యక్రమం, ప్రాజెక్ట్ టన్నెల్ పనుల పరిశీలన మరియు మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ కార్యక్రమాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజి
సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సీఎం
జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టారు. పర్యటనకు ముందుగా హెలిప్యాడ్ ప్రాంగణం, వీఐపీ రూట్లు, ఫీడర్ కాలువ శంకుస్థాపన స్థలం, టన్నెల్ ప్రాంతం, ప్రజావేదిక ప్రాంగణం మరియు పార్కింగ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు తెలియజేసి,ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావేదిక, హెలిప్యాడ్, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ముందస్తు తనిఖీలు నిర్వహించారు.విఐపీ రాక కొరకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయటం జరిగింది.
ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు మళ్లింపులు అమలు చేయడంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఫీడర్ కాలువ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించగా, అనంతరం మార్కాపురం ప్రజావేదికలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తైన అనంతరం ముఖ్యమంత్రి పర్యటనను ముగించి బయలుదేరారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పటిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసి,వివిధ శాఖల మధ్య సమన్వయం వల్ల ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా మరియు విజయవంతంగా పూర్తైందని చెప్పారు. బందోబస్తు నిర్వహణలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక బలగాలు మరియు సహకరించిన ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరకు జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.



