ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్( ఐ ఎల్ పిఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదీ మహిళా న్యాయవాదుల సదస్సు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ ప్రకాశం జిల్లా ప్రతినిధి, న్యాయవాది డాక్టర్ నూకతోటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (విశ్వేశ్వరయ్య ) లో ఉదయం 9:00 నుండి జరిగే ఈ సభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసిరి సీతక్క పాల్గొంటారని, ఈ సదస్సులో ఐ ఎల్ పి ఏ జాతీయ అధ్యక్షురాలు, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది సుజాత చౌదంటే,జస్టిస్ తిరుమల దేవి ఈడ (తెలంగాణ హైకోర్టు), హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది స్వర్ణలత, గౌరవ అతిథిగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్, రిజిస్ట్రార్ బి. విజయ లక్ష్మి,న్యాయవాదులు
హుస్నా ఖాన్, ఉషా రాణి. (కొత్తగూడెం)టి. లక్ష్మీదేవి,(రంగా రెడ్డి), టి.రేణుక,(సిద్దిపేట), డాక్టర్ నూకతోటి రవి కుమార్, న్యాయవాది (రాష్ట్ర కమిటీ) తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సులో
పివి క్రాంతి కిరణ్ రచించిన “ది ప్రాక్టికల్ అడ్వకేట్: ఎ గైడ్ టు సివిల్ ప్లీడింగ్స్, డ్రాఫ్టింగ్ మరియు కోర్ట్‌రూమ్ ప్రాక్టీస్” అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని, న్యాయవాది ఎం. సుమలత(మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా) సమీక్ష చేస్తారని, మహిళా న్యాయవాదులు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు.
28న మహిళా న్యాయవాదుల సదస్సు
25
Feb