కల్తీపాల వల్ల మరణాలు సంభవిస్తున్నందున జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవ ర్పాడు పరిధిలోని గుంటిగంగ సమీపంలోని మిల్క్ డైరీలను పుడ్ కంట్రోలర్అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హట్సన్ మిల్క్ సెంటర్, ఎమ్మెస్సార్ మిల్క్ ప్రొడక్ట్, ఆప్రాంతంలో వున్న పాల కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. పాల క్యాన్ లోని
పాలను, పాలకేంద్రంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. కల్తీపాల తయారీకి వినియోగించే పదార్థాలు ఏమైనా వున్నాయా పరిశీలించారు.లాభా పేక్ష కోసం పాలను కల్తీ చేసి విక్రయిస్తే తగు చట్ట పర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా పాలకేంద్రాలోని పాల నమూనాలను సేకరించారు. నమూ నాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పుడ్ కంట్రోలర్ శాఖ సిబ్బంది వున్నారు.
గుంటిగంగవద్దపాలసేకరణ కేంద్రాలవద్ద పుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు – పాలకేంద్రాల నుండి పాలశ్యాంపిల్స్ సేకరణ
26
Feb