శివరాంపురం జడ్పీహెచ్ స్కూల్ లోశ్రీ సరస్వతీదేవి విగ్రహాం ఆవిష్కరణ

తాళ్లూరు మండలంలోని శివరాంపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో
దాతల సహకారంతో సమకూర్చిన శ్రీసరస్వతీదేవి విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగు ఉపాధ్యాయురాలు స్వర్గీయ చల్లా దేవిక జ్ఞాపకార్థం భర్త నిడమానూరి శ్రీకాంత్, తల్లి దండ్రులు చల్లా రాఘవయ్య చౌదరి, సుబ్బరత్నంలు హైస్కూల్ కి
శ్రీసర స్వతీదేవివిగ్రహాన్ని బహుకరించి ఆవిష్కరించారు. హైస్కూల్ అభివృద్ధికి మోదడుగు వెంకటా చలం కుమారుడు మోదడుగు సుబ్బారావు, హనుమాయమ్మ దంపతులు రూ50 వేలు విరాళంగా అందజేయగావారిపేరున శిలాఫలకం ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మెచ్ఎం కె.వరదారెడ్డి, ముప్పనేని వెంకటేశ్వర్లు, వద్దినేని వెంకటేశ్వర్లు, ఆలోకం సూర్యనారాయణ, నాగయ్య, జనసేన నాయకుడు మారిశెట్టి హను మంతరావు, ఉపాధ్యాయులు కోటేశ్వరి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *