బేగంపేట ఫిబ్రవరి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు 100 రేషన్ కిట్లను కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అభిషేక్ అడపా మాట్లాడుతూ తమ నాయకురాలు కోట నీలిమ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.రంజాన్ పవిత్ర మాసంలో ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తూ ఉపవాస (రోజా)చేస్తారని అన్నారు.
ఈ సందర్భంగా పేద ,ఒంటరి మహిళలకు రేషన్ కిట్లను అందించడం తమ అదృష్టమని అన్నారు.ముందుగా ఈ కార్యక్రమాన్ని బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో నిర్వహించామని,తమ నాయకురాలు కోట నీలిమతో కల్సి డివిజన్ పరిధిలోని మరికొన్ని బస్తీల్లో కూడా రేషన్ కిట్లను పంపిణీ చేస్తామని అభిషేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్,సి.రాజేందర్ ముదిరాజ్,హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్,అల్తమాష్, బబ్లూ, ఆయూబ్,కృష్ణ,అక్బర్, వాజీద్,నవాజ్, జమీర్,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


