ఎన్ ఎస్ పి
ఆయకట్టు పరిధి కరవది మేజరులో
లష్కరుగా పనిచేసి శనివారం పదవీ విరమణ చేసిన తాళ్లూరు మండలం సోమవరప్పాడుకు చెందిన మెట్టెల రోశయ్య, ఆయన భార్య రమాదేవిలను చీమకుర్తిలోని ఎన్నెస్పీ కార్యాలయంవద్ద ఘనంగా సన్మా నించారు. ఆయన రైతులకోసం 34 సంవత్సరాలపాటు అందించిన సహాయ, సహకారాలను పలువురు వక్తలు వివరించి కొనియాడారు. ఇదే సందర్బంగా పదవీ విరమణ చేసిన లష్కరు మెట్టెల రోశయ్య దంపతులను కుటుంబీకులను కూడా సత్కరించారు. కార్యక్రమాల్లో డీఈఈ పి. గిరిబాబు, ఏఈఈలు కోటేశ్వరరావు, కిరణ్ కుమార్
, సబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు.

