సికింద్రాబాద్, మార్చి 01 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దివంగత సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ జహంగీర్ వారాసిగూడ నివాసంలో ఆదివారం ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వితంతువులు, పేద కుటుంబాలకు కొత్త దుస్తులు,నగదు సహాయం పంపిణీ చేశారు. సహాయం పొందిన వారు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహ్మద్ అజ్గర్ ఆధ్వర్యంలోనిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
