బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ – కూకట్ పల్లి నియోజకవర్గం లోని బోయిన్ పల్లి డివిజన్లో భారీ రాజకీయ ప్రకంపనలు.

బోయిన్ పల్లి మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయిన్ పల్లి  డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్. శివానంద్  వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కూకట్ పల్లి  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోవడం, ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగి అనిశ్చితి నెలకొనడంతో సరైన నాయకత్వంలేకపోవడం వల్ల నాయకులకు కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం వల్ల దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూబలపడుతుండడం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో
ప్రజల హృదయాలను గెలుచుకోవడం అలాగే జరుగుతున్న ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూసి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బండి రమేష్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి*   అహర్నిశలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలుప్రవేశపెడుతుందన్నారు. ఇప్పటికే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచడంలో మొదటి స్థానంలో ఉందని ఆయన తెలియ జేశారు.. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, నాగిరెడ్డి, దండు గల యాదగిరి,  బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి రమేష్, షేరీ సతీష్  రెడ్డి,గొట్టిముక్కలవెంకటేశ్వరరావు,రమేష్,రాజేందర్ ,దర్గా కరుణాకర్,అస్లాం,  అశోక్ ,మల్లికార్జున,   శ్రీరాములు,లక్ష్మయ్య, మేకల రమేష్ ,కుక్కల రమేష్, పుష్ప రెడ్డి, విజయలక్ష్మి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *