హైదరాబాద్ మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 27 , 28 తేదీలలో రెండు రోజుల పాటు ప్రత్యేక ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొత్తం 506 మంది వాహనదారులు పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిలో ద్విచక్ర వాహనదారులు: 401
ఆటో రిక్షా (త్రీ-వీలర్) డ్రైవర్లు: 47ఫోర్-వీలర్ మరియు ఇతర వాహనదారులు 58మంది ఉన్నారు.తనిఖీల్లో వెల్లడైన మద్యం స్థాయిల ఆధారంగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.30-50: 104 కేసులు51-100: 214 కేసులు
101-150: 105 కేసులు
151-200: 43 కేసులు
201-250: 24 కేసులు
251-300: 06 కేసులు
300 పైన: 10 కేసులు నమోదయ్యాయి.మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) విధానాన్ని అనుసరిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నాము. రహదారి భద్రత విషయంలో ప్రజలు మరియు వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నామనీ పోలీసులు తెలియ జేశారు.
రోడ్డు భద్రత లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ -506 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులపై కేసులు నమోదు.
01
Mar