రాంగోపాల్ పేట,మార్చి 2,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో
కృషి చేస్తుందనీ ,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సోమవారం మొండా మార్కెట్ పంచముఖి హనుమాన్ ఆలయ
పునర్నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో ఆలయ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే
అన్ని ఆలయాలను కోట్ల రూపాయలతో అద్భుత క్షేత్రాలుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భక్తులు స్వచ్చందంగా విరాళాలతో పునర్నిర్మాణం చేసుకోవడంఅభినందనీయమన్నారు.రాజకీయాలకతీతంగా భక్తులంతా కలసికట్టుగా ఆలయాన్నిపునర్నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ , టెంపుల్ కమిటీ చైర్మన్ బచ్చు రాజ్ కుమార్, బోర్డు మెంబెర్స్, రేవల్ల ప్రణత్ కుమార్ , సురేందర్ , దిలీప్ పురోహిత్ , శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బద్రినాథ్ యాదవ్, ఎస్ఆర్ శివకుమార్ , శ్రీకాంత్ చారి , శీలం జయ , సురేష్ , రమేష్ , గంట సుధీర్ , లావా నారాయణ , పాండుగౌడ్ , శ్రీనివాస్ , ఎంపీ సునీల్, మల్లెం రమేష్ , జగదీష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

