జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు -వయోజన విద్య ప్రకాశం జిల్లాడిప్యూటీ డైరెక్టర్ బి. జగన్మోహనరావు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా..
మార్చి 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహణకు జిల్లా కలెక్టర్ గౌ. రాజబాబు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేయసినట్లు వయోజన విద్య ప్రకాశం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి. జగన్మోహనరావు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా వ్యాప్తంగా 1,00,900 మంది అభ్యాసకులను నమోదు చేయడమైనది. స్వయం సహాయక సంఘాలు, శ్రమశక్తి సంఘాల్లోని స్త్రీ, పురుషులను వాలంటరీ టీచర్లచే గ్రామాల్లో శిక్షణ తరగతులు కొనసాగుతున్నయి.
మార్చి 15న ఫైనల్ పరీక్ష జరుగుతుంది. అభ్యాసకుల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ఫ్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించాలి. డిఆర్డిఏ, డ్వామా, మెప్మా, సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఏపిఎమ్ లు, సిఎంఎం లు, ఏపిఓలు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు అలాగే విఓఏ లు వాలంటరీ టీచర్లు పరీక్షల నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాము.
అభ్యాసకులకు సరఫరా చేయబడిన సాధన పత్రాలు (వర్క్ బుక్) నందు చివర గల. 5వ వర్క్ షీట్ ను ఫ్రీ ఫైనల్ పరీక్ష పత్రంగా నిర్ణయించడమైనది.

కావున వాలంటరీ టీచర్లు ప్రీ ఫైనల్ పరీక్షల తప్పనిసరిగా అభ్యాసకులు హాజరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *