మన్నేపల్లి సొసైటీ పరధిలో బుధవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర) కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ భవనంలో ప్రారంభించారు. ప్రతి రైతు దళారుల బారిన పడి మోన పోకుండా ప్రభుత్వం ఎపీ మార్క్ఫెడ్ మరియు నాఫేడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించటం రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. టిడిపి ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల ఆధ్వర్యంలో రైతులకు ఎవైనా ఇబ్బందులు ఉన్నా తక్షణమే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. సొసైటీ పరిధిలో రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా సరఫరా చేసినట్లు తెలిపారు. సొసైటీ కార్యదర్శి ఎ అంజి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

