తాళ్లూరు మండలంలో ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేసారు. ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, స్వర్ణ గ్రామాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది గ్రామాలలో తిరిగి ఇంటి పన్ను ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. బుధవారం వెలుగు సిబ్బంది, విఓఏలతో సమావేశం నిర్వహించారు. విఓఏలు గ్రామాలలో పన్ను చెల్లిస్తే వచ్చే ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. 2016-17 సంవత్సరం నుండి 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు వెలుగు కార్యాలయం పెండింగ్లో ఉన్న బకాయిలను రూ.17 వేలను చెల్లించాలని ఎంఎంఎస్ తీర్మానించారు. అందుకు అనుగుణంగా తాళ్లూరు స్వర్ణ గ్రామాలయానికి రూ.17 వేలను చెల్లించారు. మాధవరం గ్రామంలో కూడ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేసారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎపీఎం దేవ రాజ్, ఎంఎంఎఎస్ అధ్యక్షురాలు సుజాత, గ్రామ కార్యదర్శులు, స్వర్ణ గ్రామాలయ సిబ్బంది పాల్గొన్నారు.

