రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యం -జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యధికంగా క్రీడా రంగంలో పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
దర్శి పట్టణంలోని శివరాజనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం ను బుధవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, దర్శి నియోజక వర్గ టిడిపి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మితో కలసి సందర్శించి చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దర్శి పట్టణంలో ఇలాంటి క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడు కున్న విషయమన్నారు. మనస్సు పెట్టి వినూత్నంగా ఆలోచిస్తే సాధించలేనిది ఏమిలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు చెపుతూ ఉంటారని, దానికి మంచి ఉదాహరణ, ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం అని అన్నారు. ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రెవెన్యూ శాఖ పరంగా కృషి చేసిన తహసిల్దార్ ను, క్రికెట్ స్టేడియం లో అవసరమైన నీటి వసతి, లైటింగ్ ఏర్పాటు, గ్రాస్ ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలైన కల్పనకు కృషి చేసిన దర్శి నియోజక వర్గ టిడిపి ఇంచార్జి డా. లక్ష్మి లను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నేడు చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఆస్వాదించే గేమ్ క్రికెట్ అని, నేడు దర్శి పట్టణంలో క్రికెట్ స్టేడియంను ఏర్పాటుచేయడం సంతోషదాయకమన్నారు. రానున్న రోజుల్లో ఈ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందే అవకాసం ఉన్నందున. ఈ స్టేడియం ను మరింతగా అభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం తరపున తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. యువత కూడా ఈ స్టేడియం ను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింతగా రాణించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, యువతకు సూచించారు.
దర్శి నియోజక వర్గ టిడిపి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ.. ఈ దర్శి పట్టణంలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువత ఎంతోమంది ఉన్నారని, కానీ సదుపాయాలు, అవకాశాలు లేక ఈ ప్రాంత యువత ఇతర ప్రాంతాలకు వెళ్ళడం గమనించి ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం జరిగిందన్నారు. స్పోర్ట్స్ వలన ఆరోగ్య పరంగా ఉపయోగాలతో పాటు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ సదుపాయం కూడా ఉంటుందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ ఎన్ పిచ్చయ్య, అద్దంకి రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్సన్, తహసిల్దార్ శ్రావణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *