బాల్య వివాహాలను అడ్డుకుని బాలికల విద్యను ప్రొత్సహించాల్సిన ఆవశ్యకత ప్రతి
ఒక్కరిపై ఉందని కస్తూరిభా ప్రిన్సిపాల్ సుజిత అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్యక్షతన కస్తూరిబా గాంధీ బాలకల విద్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురష్కరించుకుని బాల్య వివాహాల అంశంపై ఆమె అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డిబి ఆర్నీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ బాలికల తమ హక్కలు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కలిగి బాల్య వివాహాల నిర్మూలనలో ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలనకు అనేక చట్టాలు చేసిందని చెప్పారు. ఇండియన్ లేబర్ లైన్ ప్రతినిధి అంకం కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు సమాన హక్కులతో జీవించే సమాజాన్ని నిర్మించేందుకు అందరూ సంకల్పించాలని చెప్పారు.

