రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లు గా మన సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదివే విద్యార్థులే ఉండాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి

       రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లు గా మన సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదివే విద్యార్థులే ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి
ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలలో చదివే విద్యార్థులతో ఆయన నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ,విద్యార్థులలో పరీక్షల భయం పోగొట్టేలా గొప్ప ప్రేరణ కలిగేలా  మాట్లాడారు. పరీక్షలంటే భయపడకూడదని, అవి విద్యార్థులలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియ అని విద్యార్థులకు  చెప్పారు. త్వరలో జరగనున్న 10 వ తరగతి  పబ్లిక్ పరీక్షలలో ప్రతి ఒక్క విద్యార్థి కచ్చితంగా పాసవ్వాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు రాష్ట్ర , జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించాలన్నారు. గత సంవత్సరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డులు అందించామని, ఈ సంవత్సరం కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి ముఖ్యమంత్రి గారి చేతులు మీదుగా అవార్డులు అందుకునేలా పట్టుదలగా చదవాలన్నారు.  ఈ సంవత్సరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 991 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవబోతున్నారని చెప్పారు. కార్పొరేట్ స్థాయికి దీటుగా వసతి గృహాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి పరీక్షకు హాజరవ్వాలన్నారు. పరీక్షల సమయంలో ఎవరూ  ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థి జీవితంలో పదోతరగతి ఒక టర్నింగ్ పాయింట్ అని, ఇప్పుడు కష్టపడి చదివి, ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఉన్నత స్థాయిలోకి రావడానికి  అవకాశం ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో విద్యార్దులు బయట ఫుడ్ తినకుండా  వార్డెన్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం టిఫిన్ పెట్టీ పరీక్షకు పంపాలని, మధ్యాహ్నం విద్యార్థులు వచ్చేసరికి భోజనం రెడీ చేసి వారికి పెట్టాలన్నారు. వార్డెన్లు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష  రాసే పరీక్ష కేంద్రాలు దూరంగా ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే అవసరమయిన బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు.అదేవిధంగా దగ్గరగా ఎక్కువ కేంద్రాలు ఉంటే ఆటోలు మాట్లాడి అందరినీ పరీక్షకు అర గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు చేరుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*అన్నీ తానైన మంత్రి స్వామి*

              పరీక్షల సమయంలో సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహాలలో చదివే విద్యార్ధులకి   తల్లిదండ్రులు స్థానంలో అన్ని తానై చూసుకుంటున్న మంత్రి… వారిలో పరీక్షల భయం పోగొట్టి మనోధైర్యం కల్పించడానికి వీడియో కాన్ఫరెన్స్ పెట్టీ వారితో పరీక్షల సమయంలో ఏం చెయ్యాలి,ఏం చెయ్యకూడదు అనే విషయాలు చెప్పారు. పరీక్షల సమయంలో వార్డెన్లు విద్యార్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవటం , వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించటం, విద్యార్థులు సాధించే విజయ కోసం ఆయన ఆతృతగా ఎదురు చూడటం, పరీక్షల నేపద్యంలో తల్లిదండ్రులు చూపే శ్రద్ధ మంత్రి లో కనిపించడం చాలా గొప్ప విషయమని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

                ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి, సాంఘీక సంక్షేమ శాఖ డి.డి లక్ష్మా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *