పశుపోషకులు దూడలు పెంపకంలో పలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి పశుగణాభివృద్ధి సంస్థ డాక్టర్ బి మురళీకృష్ణ అన్నారు. మండలంలోని కె ల్లంపల్లి గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో మేలు జాతి లేక దూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముళ్ళమూరు పశువైద్యాధికారిని ఎం విజయలక్ష్మి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశుపోషకులకు తెలియజేశారు. నట్టల నివారణ మందులు, లివర్ టానిక్, మరియు దూడల పోషణకు కావాల్సిన మినరల్ బ్రిక్స్ పంపిణీ చేశారు. ఈ పశు వైద్య శిబిరంలో 52 దూడలకు పోటీలు నిర్వహించారు. అందులో మూడు మేలు జాతి దూడలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు అందజేయడం జరిగింది. అదే విధంగా రైతులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సహాయ సంచాలకులు ఏ పురుషోత్తమ రాజు, మారెళ్ళ, తాళ్లూరు, పశు వైద్యాధికారులు ఎం కాశిరెడ్డి, వి ప్రతాపరెడ్డి, ఏ హెచ్ ఏ నరేంద్ర, జేవివో జి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


