ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆటోలకు డిజిటలైజేషన్‌ నెంబర్ స్టిక్కర్ల ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆటోలకు పోలీస్ డిజిటలైజేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డిజిటల్ నెంబర్లు స్టిక్కర్లను ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు.
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు, తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ డిజిటల్ నెంబర్లు కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పట్టణంలో నడిచే ఆటోలకు ప్రత్యేకంగా డిజిటలైజేషన్‌లో నంబర్ కలిగిన స్టిక్కర్లు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ఆటోలను సులభంగా గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, అలాగే ప్రజలకు మరింత భద్రత కల్పించడం లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్నంగా చర్యలు చేపట్టింది.

డిజిటలైజేషన్‌ నెంబర్ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో అవసరమైన సందర్భాల్లో పోలీసులు వేగంగా సమాచారాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు కూడా ఆటో వివరాలను సులభంగా గుర్తించగలిగే విధంగా ఉపయోగపడుతుందన్నారు. ఇది చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇందులో డ్రైవర్ కు సంబదించి పూర్తి వివరములతో A4 సైజ్ Display board QR Code తో కూడిన 2 sticker’s ను ఇవ్వడం జరుగుతుంది.

డ్రైవర్స్ మరియు ఓనర్స్ ఇద్దరీకి www.Todaysafejourney.com ৬ website సంబధించిన పూర్తి సమాచారం A4 size display కార్డు మరియు QR కోడ్ తో కూడిన 2 stickers ను ఇవ్వడం జరుగుతుంది.

ప్రయాణికులు ప్రయాణించు సమయమున ఆటో లో డ్రైవరు సంబధించిన పూర్తి సమాచారం తో కూడిన QR కోడ్ ఉంటుంది.

ప్రయాణికులు ఆటో ఎక్కిన తరువాత మీయొక్క భద్రత దృష్ట్యా QR కోడ్ ను స్కాన్ మరియు ఫోటో తీసుకున్న యెడల ఆటో డ్రైవర్ మరియు ఓనర్ ల యొక్క పూర్తి వివరాలు ఈ క్రింద విధముగా కనపడును.

ఇది QR కోడ్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ ద్వారా పని చేస్తుందని జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా తో మాట్లాడుతూ…

QR కోడ్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేసిన తరువాత options వస్తాయన్నారు.

✳️ Print:ఆటో డ్రైవర్ మరియు ఓనర్ గురించి పూర్తి విరాలు ప్రింట్ తీసుకోవచ్చు

✳️ Share on WhatsApp:ఆటోలో ప్రయాణించు ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏ వాహనంలో ప్రయాణిస్తున్నామో WhatsApp ద్వారా షేర్ చేయవచ్చు

✳️ Track Location: ప్రయాణికులు ఒక చోట నుండి వారు వెళ్ళె గమ్యస్థానంకు సంబంధించిన లొకేషన్ అత్యవసర సమయమున మాత్రమే Track లోకేషన్ ఎంచుకున్న యెడల పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడంవలన పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది.

✳️ Rate for Driver:ఆటో డ్రైవర్ యొక్క ప్రవర్తన తీరు పై మీ యొక్క అభిప్రాయం ను రేటింగ్ ద్వారా తెలపవచ్చు.

✳️ Complaint:ఆటో లో మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ యొక్క వస్తువులు మరిచిపోయిన యెడల మరియు ఆటో డ్రైవర్ ఏదైనా ఇబ్బంది పెట్టిన యెడల పోలీస్ కంట్రోల్ రూమ్ కు కంప్లెంట్ చేయవచ్చన్నారు.

✳️ Emergency Call:మీరు ప్రయాణించు అత్యవసర సమయములో 112 కు కాల్ చేయవచ్చు.

✳️ Nearest Police Stations:మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీకు అత్యంత దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ Display అవుతుంది. అత్యవసర సమయమున మీరు ఆ నెంబర్స్ కు కాల్ చేయవచ్చును.

డిజిటల్ నెంబర్స్ తీసుకోవాలంటే ఆటో ఓనర్ మరియు డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలతో పాటు తమ ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్ ను, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను ట్రాఫిక్ పోలీసు వారికి అందించవలసి ఉంటుంది. ఆ వివరాలను పోలీసు వారు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన వెబ్ సైట్ లో పొందుపరిచి, ఆ వివరాలతో కూడిన ఒక QR Code ను రూపొందించి ప్రత్యేకమైన డిజిటల్ నెంబర్ కలిగిన స్టిక్కర్ ను ఆటోల డ్రైవర్లు/ఓనర్లలకు అందించడం జరుగుతుంది.

కావున ,ఒంగోలు జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మరియు యజమానులు పోలీస్ వారికి సహకరించి, తమ వివరాలను అందించి డిజిటల్ నెంబర్లు పొందాలి. ఇలా చేయడం ద్వారా నేర నియంత్రణ మరియు ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల సౌకర్యాల నిమిత్తం, ప్రయాణికుల భద్రత కొరకు పోలీసు వారు తీసుకొన్న నిర్ణయాలకు మీ సహకారాన్ని అందించాలన్నారు.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లైసెన్స్ కలిగిన వ్యక్తులు మాత్రమే ఆటోలు నడపాలని, డ్రైవర్ సీటు పక్కన అనవసరంగా వ్యక్తులను కూర్చోబెట్టకూడదని కూడా సూచించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదన్నారు.

ఆటోలో దొరికిన బ్యాగ్ ను పోలీసు వారికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ లను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు..

ఇటీవల ఒంగోలు కోర్ట్ సెంటర్ వద్ద ఆటో ఎక్కి ప్రయాణించి దిగేటప్పుడు తన విలువైన బ్యాగును మర్చిపోయి వెళ్లారు. ఆ ఆటోను నడిపిన ఒంగోలు బాలాజీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గద్దె నాగేశ్వరరావు ఆ బ్యాగును గుర్తించి వెంటనే ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆ బ్యాగులో సుమారు రూ.30 లక్షల విలువ గల బంగారం మరియు నగదు ఉన్నాయి.

అలాగే ఒంగోలు బిలాల్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఖలీల్ వెంకటేశ్వర కాలనీ నుండి ప్రయాణికులను ఎక్కించుకుని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వరకు వారిని దించారు. ప్రయాణికులు దిగిన తర్వాత ఆటో వెనుక భాగంలో ఉన్న బ్యాగును మర్చిపోయి వెళ్లారు. దానిని గుర్తించిన ఆటో డ్రైవర్ షేక్ ఖలీల్ వెంటనే ఆ బ్యాగును ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. ఆ బ్యాగులో సుమారు 6 సవర్ల బంగారం, వెండి మరియు నగదు ఉన్నాయి.

బంగారు ఆభరణాలు, నగదుతో దొరికిన బ్యాగ్ ను ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించి తన ఔనత్యం చాటుకున్నా ఆటో డ్రైవర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్.డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ రమణారెడ్డి, ట్రాఫిక్ ఎస్సై కోటయ్య,శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *