గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలు, ఎదుర్కోవాల్సిన చట్టపరమైన చర్యలు మరియు శిక్షలు పై ఎస్.పి హర్షవర్ధన్ రాజు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వలన ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, యువత మత్తుకు బానిసవ్వడం వలన భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయో కూడా వివరించటం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గంజాయి మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి పెద్ద ప్రమాదమని తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ దిశగా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం గడపాలని “డ్రగ్స్ వద్దు బ్రో” అనే సందేశాన్ని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. మత్తు పదార్థాల నిర్మూలన ద్వారా ఆరోగ్యవంతమైన, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, నిల్వ చేసే లేదా వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్.డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ రమణారెడ్డి, ట్రాఫిక్ ఎస్సై కోటయ్య,శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *