ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన హర్యానా మాజీ గవర్నర్ బండారు.

న్యూ ఢిల్లీ ,మార్చి 1 0,(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రధానమంత్రి మోదీని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం న్యూఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం మొదటిసారి ప్రధాన మంత్రి ని కలిసిన దత్తాత్రేయ. ఈ సందర్భంగా తనకు మోదీ మొదటి క్యాబినెట్ లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా , అనంతరం హిమాచల్ ప్రదేశ్ , హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు
మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ తన ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకాన్ని ప్రధాన మంత్రి కి అందజేశారు. ఈ పుస్తకం ఎంతో మందికి ప్రేరణనిచ్చే విధంగా ఉందని మోడీ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు.సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దత్తాత్రేయని ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు.స్పందించిన బండారు దత్తాత్రయ తాను ఆరోగ్యంగా ఉన్నానని, దాదాపు అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నానని తెలిపారు.ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ చాలా సంతోషమని, ఇదే ఉత్సాహంతో ప్రజా జీవితంలో కొనసాగాలని సూచించినట్లు దత్తాత్రేయ తెలిపారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *