దేశం మరియు ఆంధ్రప్రదేశ్ లో చేపల పెంపుదలకు అదనపు పరిశోధనా సంస్థలు మరియు ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు,పధకాలు, నిధులు మరియు ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్య, పశు సంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖామంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ గారు సమాదానమిస్తూ ..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ( ఐ సి ఏ ఆర్ ) నివేదిక ప్రకారం, దేశంలో ప్రత్యేక కార్యాచరణ గల 30 ప్రాంతీయ స్టేషన్లతో 8 మత్య పరిశోధనా కేంద్రాలు పనిచేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడలో 1 , విశాఖపట్నంలో 2 మరియు విజయవాడ లో 1 ప్రాంతీయ పరిశోధనా కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. చేపల ఉత్పత్తి పెంపుదల, సుస్థిర నీటి వినియోగం, నీటి సంరక్షణ, పర్యావరణ, నిర్వహణ తదితర అంశాలతోపాటు ఈ కేంద్రాలలో మత్య సైన్సు బోధన, పరిశోధన మరియు సాంకేతికతల అభివృద్ధిపై పనిచేస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో నాణ్యమైన విత్తన మరియు చేపల ఉత్పత్తి, పెంపకం నియంత్రణ, ఉత్పత్తి సంబందిత తదితర విషయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక చట్టాలు రూపొందించి మత్య విశ్వవిద్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటుచేసి, గత 3 సం.లలో 40,000 కస్టమర్లకు సాంకేతిక మద్దతు మరియు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
నాణ్యమైన చేపల పెంపుదలతోపాటు అభివృద్ధి చెందిన చేపల జాతులు, ఆరోగ్యం, సంరక్షణ, వ్యాధుల నిర్ధారణ మరియు పరిశోధనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మత్య శాఖ రాష్ట్ర విశ్వవిధ్యాలయం మరియు ప్రైవేటు రంగ సంస్థల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను అమలు చేయుచున్నదని కేంద్ర మంత్రి తెలియజేశారు.
మత్య సంపద పెంపకు పరిశోధనా కేంద్రాల ఏర్పాటుపై మాగుంట ప్రశ్న
10
Mar