ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పంచాయతీ కార్యదర్శులు ఈనెల 25లోపు నూరుశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని అద్దంకి డియల్ డి ఓ సువార్తమ్మ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధ వారం సమావేశం జరిగింది. కొందరు నూరుశాతం ఇంటి పన్నులు వసూళ్లకు చేర్చు వలో వున్నారన్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికి అలసత్వం ప్రద ర్శిస్తున్నారన్నారు. ఉదయం, సాయంత్రం ఇండ్లకు వెళ్లి ఇంటి యజమాను లకు డిమాండ్ నోటీసులు అందజేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేసి రసీ దులు అందజేయాలన్నారు. మందకొడిగా వసూళ్లు చేసి లక్ష్యా న్ని చేరువ కాక పోతే చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. నూరుశాతం పూర్తయిన పంచాయతీ కార్య దర్శులు మండల కేంద్రమైన తాళ్లూరు, వ్యాపార కేంద్రమైన తూర్పుగంగవరం గ్రామాలందు ఇంటి పన్నుల వసూళ్లకు సహకారం అందించాలన్నారు. పంచాయ తీ గ్రామాలందు ఇంటి పన్నుల వసూళ్లకు సహకారం అందించాలన్నారు. పంచాయతీల పరిధిలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వేలు పూర్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో పి అజిత, డిప్యూటీ ఎంపీడీవో వి. శ్రీనివాసరావు, ఎంసీవో రవి, గ్రామ కార్యదర్శులు షేక్ షహనాజ్ బేగం నాగమల్లే శ్వరి, సుబ్బారెడ్డి, మొలకయ్య, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
