తనిఖీ నిమిత్తం రబీ పంట వివరాలు ప్రదర్శన

సామాజిక తనిఖీ నిమిత్తం అన్ని రైతు సేవా కేంద్రాలలో రబీ 2025-26 ఈ పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. శివరామపురం రైతు సేవా కేంద్రంలో రైతుల సమక్షంలో 2025-26 పంట నమోదు వివరాలను ప్రదర్శించినట్లు చెప్పారు. మండలంలో 21,595 ల్యాండ్ పార్శిల్ బుకింగ్ పూర్తి చేయటం జరిగిందని తెలిపారు. మార్చి పది నుంచి 13 వరకు రైతు సేవా కేంద్రాల్లో గ్రామ సభల ద్వారా సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు చెపాపరు. రైతులు జాబితాలు పరిశీలించుకుని తప్పులు ఏవైనా ఉంటే గమనించుకుని విఏఏ లకు తెలిపాలని చెప్పారు. విఏఏ వెంకట రాజా, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *